RTC Employee Beaten Up: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్టీసీ ఉద్యోగికి తోటి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ వద్ద రాజేందర్ అనే ఆర్టీసీ విజిలెన్స్ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళ చెప్పడంతో సహచర ప్రయాణికులు ఆగ్రహానికి గురై చేతివాటం ప్రదర్శించారు.
మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్టీసీ ఉద్యోగికి దేహశుద్ధి - ts news
RTC Employee Beaten Up: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల ఆర్టీసీ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తికి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్టీసీ ఉద్యోగికి దేహశుద్ధి
కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వచ్చిన బస్సులో ఓ మహిళ పట్ల ఆర్టీసీ ఉద్యోగి రాజేందర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే లేచి తోటి ప్రయాణికులకు తెలపడంతో తోటి ప్రయాణికులు వెంటనే అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: