తెలంగాణ

telangana

ETV Bharat / crime

rtc bus hit lorry at anajipuram: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా నేర వార్తలు

rtc bus hit lorry at anajipuram: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం క్రాస్​ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

RTC BUS HIT LORRY
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

By

Published : Feb 25, 2022, 1:01 PM IST

rtc bus hit lorry at anajipuram: ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొన్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం క్రాస్​ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్​పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మోత్కూరు వచ్చి తిరిగి వెలుతున్న సమయంలో అనాజిపురం స్టేజి వద్దకు రాగానే వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పర్రెపాటి యాదమ్మ అనే వృద్ధురాలికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గతంలోనూ ఇసుక లారీ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందిన సంగతి మరువకముందే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: Road accident: కూలీ పనుల కోసం వెళుతుండగా ఆటోను ఢీకొన్న టిప్పర్... చివరికీ...

ABOUT THE AUTHOR

...view details