ఆర్టీసీ బస్సు బోల్తా.. 13 మందికి తీవ్రగాయాలు - kamareddy bus accident news
05:56 February 14
ఆర్టీసీ బస్సు బోల్తా.. 13 మందికి తీవ్రగాయాలు
కామారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెక్రియల్ బైపాస్ రహదారిపై మహారాష్ట్ర బస్సు బోల్తా పడి 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో... బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించడం వల్ల... అందరూ భయాభ్రాంతులకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏం జరిగిందో తెలిసే లోపే... బస్సు మూడు పల్టీలు కొట్టిందని బాధితులు తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. అంతకుముందు... బిలోలి వైపు వెళ్లాల్సిన బస్సు దేగ్లూర్ వైపు వెళ్తోందని... తాము గమనించి చెప్పగా తిరిగి వచ్చాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రెప్పపాటులో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు