Bus Accident at Buchireddypalem : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 34 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు నెల్లూరు- బళ్లారి రహదారిపై దామరమడుగు మఠం కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. అనంతరం రోడ్డుపై నుంచి 15 అడుగుల లోతులో ఉన్న పంటపొలాల్లోకి బోల్తా పడింది.
APSRTC Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా: మహిళ మృతి.. 34 మందికి గాయాలు - Buchireddypalem Bus Accident news
Bus Accident at Buchireddypalem : ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Buchireddypalem Bus Accident : ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ప్రసాద్ రెడ్డి తెలిపారు.