ఓ గోదాములో నిషేధిత పత్తివిత్తనాలు నిల్వ ఉంచారన్న సమాచారంతో చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు ఇళ్లలోను తనిఖీలు చేశారు. ఓ గోదాములో దాచిన సుమారు 22 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 42 లక్షలు ఉంటుందని తెలిపారు.
రూ.42 లక్షలు విలువైన నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం - తెలంగాణ వార్తలు
కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో భారీగా.. నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 42 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
kumaram bheem news
కాగజ్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ఏపీలోని గుంటూరుకు చెందిన బలంపెల్లి సాంబశివరావు, చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన పర్వతాల ప్రశాంత్, బెజ్జూరు మండలానికి చెందిన లంగారి భూపతి... ఈ విత్తనాలు ఉంచినట్లు గుర్తించారు. పత్తి విత్తనాలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:ఇళ్లకు తాళాలు.. రెచ్చిపోతున్న చోరులు!