వైద్య పరికరాలు సరఫరా చేస్తానంటూ రూ. 4. 43 కోట్ల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రెండేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రమేశ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
హబ్సిగూడాలోని అర్పితా డయాగ్నస్టిక్స్... 2019లో జీఈ 1.5 టెస్లా ఎమ్ఆర్ఐ సామగ్రి కోసం ఆస్ట్లేర్ మెడిస్ అనే సంస్థను సంప్రదించింది. నిందితుడు రమేశ్.. ఆ సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకొని, వైద్య పరికరాల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా అతను తెలిపిన ఖాతాలో.. బాధిత సంస్థ డబ్బు జమ చేసింది.