నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచిన ఓ స్థావరంపై.. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ. 3 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో ఇది జరిగింది.
రూ. 3 లక్షల విలువైన గుట్కా పట్టివేత
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ గుట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
Breaking News
నిందితుడు అన్వర్ ఖాన్‌పై కేసు నమోదు చేసి.. గుట్కా తయారీ చేసే మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ విక్రయాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Liquor seize: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు