Theft in hanamkonda: పట్టపగలే భారీ దోపిడీ.. కారులోని రూ.25 లక్షలు చోరీ - తెలంగాణ వార్తలు

16:04 November 15
కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ
హనుమకొండలో సినీ ఫక్కీలో పట్టపగలే భారీ చోరీ(Theft in hanamkonda) జరిగింది. నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షల నగదును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. హనుమకొండ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్... బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టగా ఓ వ్యక్తి వాటిని అపరించాడు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే... డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. అయితే లోపు కారు అద్దాలు ధ్వంసం కావడంతో అనుమానంతో... కారు లోపల చూడగా డబ్బులు పోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని డీసీపీ పుష్ప పరిశీలించారు. నగదు దోచుకెళ్తున్న దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట