తెలంగాణ

telangana

ETV Bharat / crime

లాటరీ పేరుతో లూటీ.. అకౌంట్ నుంచి రూ.20లక్షలు మాయం - తెలంగాణ వార్తలు

కరోనా విపత్కర సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజూ కొత్తదారులు వెతుక్కుంటూ ఖాతాలు ఖల్లాస్ చేస్తున్నారు. అమెరికాకు వెళ్లిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.20 లక్షలు దోచేశారు. ఎలాంటి అనుమానం రాకుండా డబ్బును కాజేశారని బాధితులు వాపోయారు. మరో కేసులో లాటరీ పేరుతో మహిళ వద్ద నుంచి నగదు కాజేశారు.

 cyber crimes in hyderabad, money stolen by cyber crime
నగదు కాజేసిన సైబన్ నేరగాళ్లు, హైదరాబాద్​లో సైబర్ నేరాలు

By

Published : May 14, 2021, 7:20 AM IST

కరోనా కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.20 లక్షలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. అంబర్​పేట్ డీడీ కాలనీలో నివాసముండే శ్రీనివాస మూర్తి కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్లారు. ఇంటర్​నెట్ బ్యాంకింగ్ అకౌంట్ చెక్ చేసుకోగా రూ.20 లక్షలు మాయమయ్యాయని బాధితుడు తెలిపారు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

మరో కేసులో కోన్ బనేగా కరోడ్ పతి లాటరీ పేరుతో ఓ మహిళ వద్ద రూ.లక్షా 60 వేలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఓల్డ్ సిటీకి చెందిన ఆమె ఫిర్యాదు చేశారు. పై రెండు సంఘటనలపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details