Money seized in private bus: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ. 2 కోట్లు బయటపడ్డాయి. ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం-గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బస్సు సీట్ల కింద లగేజీ క్యారియర్.. ఓపెన్ చేసి చూస్తే 2 కోట్ల నగదు - ప్రైవేట్ బస్సులో రూ.2కోట్ల నగదు స్వాధీనం
Money seized in private bus: టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ బస్సును చెక్ చేసిన పోలీసులకు నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఓ లగేజీ క్యారియర్‌లో రూ. 2 కోట్లు పోలీసుల కంటపడింది. కాగా ఆ నోట్లు అసలైనవా.. నకిలీవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు స్వాధీనం
బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో తరలిస్తుండగా.. నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు నకిలీవా లేదా అసలా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:KTR Tweet Today: 'అది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండేది'