లెక్చరర్ పోస్టుల పేరుతో రూ.2 కోట్లు టోకరా - 2 crore fraud in Miryalaguda
10:42 April 12
మిర్యాలగూడలో లెక్చరర్ పోస్టుల పేరుతో రూ.2 కోట్లు టోకరా
Job fraud in miryalaguda: నిరుద్యోగులకు అవకాశాల ఆశ చూపి.. అందినకాడికి దోచుకున్న మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వెంకటరెడ్డి, విజయరామరాజు.. లెక్చరర్ పోస్టులున్నాయంటూ ఉద్యోగార్థులకు ఎర వేశారు. ఎన్నో రోజులుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆ పోస్టులను ఎలాగైనా పొందాలన్న ఆతృతతో.. నిందితులు వేసిన గాలానికి చిక్కారు. పోటీ ఎక్కువగా ఉందని.. ఉద్యోగాలు దక్కాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని నమ్మబలికారు.
ఉద్యోగం పొందటమే పరమావధిగా భావించిన అభ్యర్థులు నిందితులు చెప్పినట్టుగా.. సుమారు రూ.2 కోట్ల వరకు ముట్టజెప్పారు. తీరా.. డబ్బులు ఇచ్చాక నిందితులిద్దరు ముఖం చాటేయటంతో మోసపోయినట్టు గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: