రౌడీషీటర్‌ను కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కాలపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ జబెర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు.
ముస్తఫానగర్‌లో రౌడీషీటర్ దారుణహత్య - Telangana news
హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణహత్య చోటుచేసుకుంది. ఓ రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ముస్తఫానగర్‌లో రౌడీషీటర్ దారుణహత్య
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి.