హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి కత్తిపోట్ల కలకలం రేగింది. చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో ముస్తాక్ అలియాస్ ముస్తాక్ డాన్ అనే రౌడీషీటర్‌ను కత్తులతో నరికి చంపారు కొందరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు.
OLD CITY MURDER: రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు
పాతబస్తీలో వరుస హత్యలు కలవరపెడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అందరూ చూస్తుండగానే రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. అది మరువక ముందే శుక్రవారం అర్ధరాత్రి మరోహత్య జరిగింది. ముస్తాక్ అనే రౌడీషీటర్‌ను కత్తులతో నరికి చంపారు దుండగులు.
రౌడీషీటర్ దారుణ హత్య
రెక్కి నిర్వహించి మరీ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా ఘటనలను కట్టడి చేసేందుకు పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లతో పాటు హెచ్చరికలు జారీ చేస్తున్నా పాతబస్తీలో హత్యల పరంపర కొనసాగడం ఉన్నతాధికారులను కలవరపెడుతోంది.
ఇవీ చూడండి:GUN FIRE: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం