హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. రౌడీ షీటర్ మహమ్మద్ పర్వేజ్ అలియాస్ ఫారు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తితో అతి దారుణంగా నరికి చంపారు.
పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య..! - పాతబస్తీలో ఘోరం
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రెయిన్ బజార్ పీఎస్ పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ పర్వేజ్ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య..!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోస్ట్మార్టం నిమిత్తంకి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు వెల్లడించలేదు.