Rowdy sheeter killed in Nizamabad district: నిజామాబాద్ శివారులోని నెహ్రూనగర్‌లో ఆదివారం రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం జంగిల్ ఇబ్బు(29) అలియాస్ ఇబ్రహీం చావుస్‌ను.. అతని ప్రత్యర్థి అయిన రౌడీషీటర్ ఆరిఫ్, అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. నగరానికి చెందిన ఇబ్రహీం చావుస్, ఆరిఫ్ డాన్ ఇద్దరు పాత నేరస్థులు. వీరివురిపై రౌడీషీట్లు తెరిచి ఉన్నాయి. తాజాగా ఇబ్రహీం పీడీ యాక్టులో జైలు నుంచి బయటకు వచ్చాడు.
సినీఫక్కీలో రౌడీ షీటరు హత్య.. అసలేం జరిగిందంటే? - Rowdy sheeter killed in Nizamabad district
Rowdy sheeter killed in Nizamabad district: ప్రస్తుతం జరిగే కొన్ని హత్యలు సినిమా సన్నివేశాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. నిజ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు సినిమా మాదిరి అనిపిస్తాయి. అలాంటి సంఘటనే నిజామాబాద్‌లో జరిగింది.
ఎలా జరిగింది: వీరివురికి పరిచయం ఉన్న.. సారంగపూర్‌కి చెందిన హర్షద్ పుట్టినరోజుకి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. దీనికి మొదట ఇబ్రహీం వెళ్లాడు. ఈ క్రమంలో ఆరిఫ్ డాన్‌కు చెందిన ఓ పాట నడుస్తుండగా ఇబ్రహీంకు నచ్చలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో ఆరిఫ్ ఎదురుపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆరిఫ్ తన అనుచరులతో కలిసి కత్తితో ఇబ్రహీంపై దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరో పోలీసు స్టేషన్ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారని చెప్పారు.
ఇవీ చదవండి: