నిజామాబాద్‌లో రౌడీషీటర్ ఆరిఫ్ చేసిన కాల్పుల ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నగర శివారులోని సారంగాపూర్‌లో రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకల్లో ఆరిఫ్... తుపాకీతో హల్‌చల్ చేశాడు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అది నకిలీదిగా తేలినట్లు వెల్లడించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించినందుకు ముగ్గురిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Hulchul with Gun: తుపాకీతో రౌడీషీటర్ హల్‌చల్.. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు - rowdy sheeter gun firing
16:30 August 12
తుపాకీతో రౌడీషీటర్ హల్‌చల్.. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు
చోరీలు, దారి దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆరిఫ్.. పీడీయాక్టు కింద అరెస్టు అయ్యి ఇటీవలే విడుదలయ్యాడు. ఓ ఫామ్‌హౌస్‌లో ఆరిఫ్ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్దఎత్తున అతడి అనుచరులు పాల్గొన్నారు. వేడుకల్లో కొందరు అనుచరులు తల్వార్లు, పిస్తోళ్లతో కనిపించారు. ఫామ్‌హౌస్‌కి కారు ముందు భాగంలో కూర్చొని అభివాదం చేస్తూ ఆరిఫ్ వచ్చాడు. అనుచరులందరికీ అభివాదం చేస్తూ.. వస్తోన్న ఆరిఫ్‌కు గుంపులో నుంచి ఒకరు తుపాకీ అందించారు. దానితో అభివాదం చేస్తూనే... గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేశాడు ఆరిఫ్. ఈ తతంగాన్నంతా పలువురు తమ చరవాణుల్లో వీడియో తీయగా... అది కాస్తా వైరల్‌గా మారింది.
నిన్న ఓ తెరాస నాయకుడు తల్వార్‌తో తన పుట్టినరోజు వేడుకల్లో కేక్ కోయగా.. ఈరోజు కాల్పుల ఘటన బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆరిఫ్ తండ్రి షేక్ అంజాద్... "అది డమ్మీ గన్ అని.. ఆన్లైన్లో తెప్పించామ"ని చెబుతున్నారు.
ఇదీ చూడండి:
Etela Rajender: నా ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధం.. హరీశ్‌కు ఈటల సవాల్