తెలంగాణ

telangana

ETV Bharat / crime

జడ్పీ హైస్కూల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు.. విద్యార్థినులకు గాయాలు

ceiling Falls On the students
ceiling Falls On the students

By

Published : Feb 24, 2022, 11:35 AM IST

Updated : Feb 24, 2022, 3:40 PM IST

12:05 February 24

జడ్పీ హైస్కూల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చు

జడ్పీ హైస్కూల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చు

ceiling Falls On the students: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో పెను ప్రమాదం తప్పింది. 10 వ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు.

12:05 February 24

ఆందోళనలో తల్లిదండ్రులు

గాయపడిన విద్యార్థిని

ఈ ఘటనతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. భవనం చాలా సంవత్సరాల క్రితం కట్టింది కావడంవల్లే పెచ్చులూడి పడ్డాయని ఉపాధ్యాయులు తెలిపారు.

11:32 February 24

జడ్పీ హైస్కూల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చు

గాయపడిన విద్యార్థిని

తక్షణమే భవనానికి మరమ్మతులు చేపట్టారని.. త్వరలో కొత్త భవనం నిర్మించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనతో మిగతా విద్యార్థులు మళ్లీ పెచ్చులు ఊడి మీద పడతాయేమోనని ఆందోళన చెబుతున్నారు.

Last Updated : Feb 24, 2022, 3:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details