తెలంగాణ

telangana

ETV Bharat / crime

అర్ధరాత్రి దొంగలు హల్​చల్​.. తాళం వేసిన ఇళ్లలో దోపిడీ - హనుమాన్​పేటలో దొంగల హల్​చల్​

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు అర్ధరాత్రి హల్​చల్​ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. హనుమాన్​పేటలో వరుసగా తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు చేశారు.

miryalaguda, hanumanpet
హనుమాన్​పేట, మిర్యాలగూడ

By

Published : Feb 12, 2021, 8:21 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి దొంగలముఠా రెచ్చిపోయింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. అందినకాడికి బంగారం, నగదు చోరీ చేసి ఉడాయించారు. గురువారం అర్ధరాత్రి హనుమాన్ పేటలో వరుసగా తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో పథకం ప్రకారం చోరీ చేశారు. పర్వతాలు అనే లైన్​మెన్​ ఇంట్లో 6 తులాల బంగారం, రూ.పదివేల నగదును అపహరించారు. మరొకరి ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో ఇంటిని అపరిశుభ్రం చేశారు. వాళ్లు ఊరు నుంచి వస్తే కానీ చోరీ ఏమాత్రం జరిగిందనే విషయం స్పష్టం కాదు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్స్.. దొంగల వేలిముద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలో మిర్యాలగూడలో బుధవారం హౌసింగ్ బోర్డ్​లోని 10 ఇళ్లలో చోరీకి యత్నించిన వీడియోలు వైరల్​గా మారాయి. పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్​ చేసి దొంగల బారి నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

దొంగ సంచరిస్తున్న సీసీటీవీ దృశ్యాలు

ఇదీ చదవండి:కాలువలో పడిన కారు డ్రైవర్​ మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details