సికింద్రాబాద్లోని ప్రముఖ గణేష్ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న సొమ్మును దొంగిలించారు. రాత్రి 2 గంటల సమయంలో గుడి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించారని ఆలయ వర్గాలు తెలిపాయి. కరోనా తీవ్రత, లాక్డౌన్ దృష్ట్యా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గడంతో హుండీ ఆదాయం కూడా కొంతమేర తగ్గినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీ - robbery in secunderabad ganesh temple
సికింద్రాబాద్లో అర్ధరాత్రి దుండగులు హల్చల్ సృష్టించారు. స్థానికంగా ఉన్న గణేష్ ఆలయంలో హుండీని దొంగిలించారు. దాదాపు రూ. లక్ష సొమ్ము దొంగతనానికి గురైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
గణేష్ ఆలయంలో దొంగతనం
చోరీ గురించి గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!