తెలంగాణ

telangana

ETV Bharat / crime

నల్లమలలో అర్ధరాత్రి దారి దోపిడీ దొంగల హల్​చల్.. - Midnight robbery

Robbery in Prakasam District: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో.. అర్ధరాత్రి దారి దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని వెంబడించి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Robbery in Prakasam District
Robbery in Prakasam District

By

Published : Dec 25, 2022, 3:48 PM IST

Robbery in Prakasam District: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో దారి దోపిడీ జరిగింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్‌పోస్టు సమీపంలో.. అర్ధరాత్రి బంగారం, నగదుతో వెళ్తున్న వ్యాపారుల కారును దుండగులు అడ్డగించారు. ముందు నుంచే వ్యాపారుల కారును.. మరో కారులో వెంబడించిన ఆరుగురు దుండగులు.. వాహనానికి అడ్డంగా ఆపిన తర్వాత, అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్‌ సహా ఐదుగురిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

ఆపై నగదు, బంగారంతో సహా కారును అపహరించారు. నంద్యాల నుంచి నరసరావుపేటకు వెళ్తుండగా ఘటన జరగిందని బాధితులు నంద్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిచ్చిన సమాచారంతో గిద్దలూరు పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఐతే గిద్దలూరు మండలం కెఎస్‌.పల్లె రైల్వే వంతెన వద్ద కారును దుండగులు వదిలివెళ్లారు. కారులోని ప్రయాణించిన వ్యక్తుల నుంచి డబ్బు, బంగారాన్ని అపహరించుకుపోగా.. లాకర్‌లో దాచిన నగదును విడిచివెళ్లారు. లాకర్​లో ఉన్న 14 లక్షలు, 950 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఏపీలో అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు హల్​చల్..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details