తెలంగాణ

telangana

ETV Bharat / crime

THEFT : దొంగతనం చేయడంలో వీళ్ల స్టైలే వేరప్ప!

కష్టపడకుండా కన్నాలు వేసి సంపాదించడం వాళ్లకు అలవాటు. ఆ అలవాటే క్రమంగా సరదాగా మారింది. ఒక్కో ఇంట్లో ఒక్కో స్టైల్​లో చోరీ(THEFT) చేయడం ప్రారంభించారు. వేసిన తాళం వేసినట్లే.. ఉంచి.. ఎలాంటి గందరగోళం సృష్టించకుండా స్మూత్​గా దొంగతనాలు(THEFT) చేస్తారు. అలాగే.. ఓ ఇంట్లోనూ చోరీకి బయల్దేరారు. నగదు, ఆభరణాలు అపహరించారు(THEFT). కానీ.. ఆ అపహరించిన స్టైల్​ చూసి.. ఇంటి యజమానితో పాటు పోలీసులూ షాక్ అయ్యారు. ఇంతకీ ఆ దొంగలు ఎలా దొంగిలించారంటే..!

robbery-in-eepuruvaripalem-guntur-district
దొంగతనం చేయడంలో వీళ్ల స్టైలే వేరప్ప!

By

Published : Jul 10, 2021, 2:54 PM IST

ఏదైనా వస్తువు వాహనంలో పెట్టి తాళం వేయడం మర్చిపోతే వచ్చేసరికి అది మాయమవడం(THEFT) గురించి విన్నాం. కాస్త ధైర్యం చేసి ఆ వాహనాన్నే ఎత్తుకెళ్లడం(THEFT) చూశాం. తాళాలు పగులగొట్టి, తలుపులు విరగ్గొట్టి, గోడలకు కన్నాలు పెట్టి.. ఇళ్లలోకి చొరబడి దొంగతనం(THEFT) చేయడం గురించీ మనకు తెలుసు. కానీ ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ వింత దొంగతనం చోటుచేసుకుంది.

దొంగతనం చేయడంలో వీళ్ల స్టైలే వేరప్పా

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామంలో ఓ విచిత్ర చోరీ(THEFT) జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఏకంగా బీరువానే పొలాల్లోకి ఎత్తుకెళ్లారు దొంగలు. రూ.10 వేల నగదు, వెండి సామాన్లు అపహరించారు(THEFT). చీరలు, ఇతర పత్రాలు పొలంలోనే పడేశారు.

పని కోసం వెళ్తే.. ఇల్లు గుల్ల..

గ్రామానికి చెందిన కేతినేని హరిబాబు కుటుంబం నాలుగు రోజుల క్రితం వ్యవసాయ పనుల కోసం కర్ణాటక రాష్ట్రం రాయచూర్​కి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన దొంగలు తలుపు గడియ విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పరుపు, దిండ్లు ఉపయోగించి శబ్దం రాకుండా ఆ ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లారు. బీరువాలో నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.

పని ముగించుకుని ఇంటికి తిరిగివచ్చిన ఆ కుటుంబం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బీరువా కనబడకపోవడం చూసి ఖంగుతిన్నారు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. పెట్టిన కిటికీలు పెట్టినట్లే ఉన్నా.. బీరువా ఎక్కడికెళ్లిందో అర్థం గాక తలలు పట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్లను అడిగినా వారు తమకేం తెలియదన్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ కుటుంబానికి స్థానికులు.. పొలంలో ఓ బీరువా కనిపించిందని చెప్పారు. వెంటనే అక్కడికి పరుగులు తీశారు. వెళ్లి చూస్తే పొలంలో పడి ఉన్న బీరువా కనిపించింది. దాని పక్కనే చీరలు, ఇతర దుస్తులు, పత్రాలు పడి ఉన్నాయి. లాకర్ తెరిచి చూస్తే అందులో ఉండాల్సిన వెండి ఆభరణాలు, వస్తువులు, నగదు కనిపించలేదు.

మేం ఊరెళ్లిన విషయం తెలుసుకున్న దొంగలు.. తెలివిగా.. ఇంటి తాళం తీసి ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లారు. పొలంలో బీరువాను పడేసి అందులో ఉన్న నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం.

- కేతినేని హరిబాబు, బాధితుడు

బాధితుల సమాచారంతో చిలకలూరిపేట రూరల్ ఎస్సై భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details