robbery attempt in muthoot finance: సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడికి యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 11గంటల సమయంలో ముగ్గురు వ్యక్తుల ముఠా ముత్తూట్ ఫైనాన్స్‌కు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని గమనించిన ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది అలారం నొక్కారు. అలారం మోగడంతో సిబ్బంది, స్థానికులు అప్రమత్తమయ్యారు.
దోపిడికి యత్నించిన ముగ్గురు పరుగందుకున్నారు. తిరుమలగిరి ఎల్ఐసీ కార్యాలయం వరకు దుండగులు పరుగెత్తారు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు లభించడంతో అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.