తెలంగాణ

telangana

ETV Bharat / crime

Robbery at ATM: అకౌంట్​కు హోల్డర్​కు మెసేజ్​ వెళ్లకుండా.. పవర్​కట్​​ చేసి ఏటీఎంలో దొంగతనం - ఏపీ వార్తలు

Robbery at ATM: ఏటీఎం కేంద్రాల్లో అక్రమంగా నగదు విత్​డ్రా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏపీలోని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.77,500/- నగదును స్వాధీనం చేసుకున్నారు.

Robbery at ATM
Robbery at ATM

By

Published : Dec 10, 2021, 10:52 PM IST

Robbery at ATM: ఏటీఎం కేంద్రాల నుంచి అక్రమంగా నగదు విత్​డ్రా చేస్తున్న హరియాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఏపీలోని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77,500/- నగదు, 71 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్​లు, 2.1 కేజీల గంజాయి, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.

హరియాణా రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులతో పాటు మరో వ్యక్తి కలిసి ఇతరులకు సంబంధించిన ఏటీఎం కార్డుల ద్వారా అక్రమంగా నగదు డ్రా చేసుకోవడం పరిపాటిగా చేసుకున్నారు. ఈక్రమంలో నాలుగు రోజుల కిందట అనంతపురం సంగమేష్ నగర్​లోని ఓ ఏటీఎంలోకి ఈ ముగ్గురు చొరబడ్డారు. వీరి వద్ద ఉన్న సాంకేతిక పరికరాల సహాయంతో ఏటీఎం మెషిన్​ను మేనేజ్ చేసి నగదు విత్​ డ్రా చేసుకున్నారు. నగదు విత్​ డ్రా వివరాలు ఖాతాదారుల అకౌంట్​లో నమోదు కాకుండా మోసాలకు పాల్పడ్డారు. ఏటీఎం నుంచి నగదు లోడ్​ అయి బయటకు వచ్చే సమయంలో వారి వద్ద గల సాంకేతిక పరికరాలతో ఏటీఎం మెషిన్​కు పవర్​ సప్లయ్​ కాకుండా చేశారు. నగదు తీసుకున్న తర్వాత పవర్​ సప్లయ్ ఇచ్చారు. ఈ విధంగా సుమారు రూ. 4,05,500/- నగదు విత్​ డ్రా చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details