వారు లేడీలు కాదు.. కిలాడీలు. పట్టపగలే చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకే రోజు ముగ్గురు మహిళల వద్ద... చోరీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. బిల్లుడుగుడెనికి చెందిన జెట్టి మంగమ్మ వినాయకపురం యూనియన్ బ్యాంకులో... 30 వేల రూపాయలు జమ చేసేందుకు వెళ్లారు. మంగమ్మ క్యూలైన్లో నిల్చొని.. నగదు చెల్లించే లోపే ఆమె సంచిలోని డబ్బును కాజేశారు కిలాడీ లేడీలు.
Theft in Bank: క్యూలైన్లో మాటలు కలిపారు... 90వేలు దోచేశారు..
వరుస చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు కిలాడీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఒకే రోజు మూడు చోట్ల చోరీ చేశారు. ఓ చోట డబ్బు తస్కరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సీసీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలు నమోదయయ్యాయి. ఆ మహిళల వెంట ఇద్దరు చిన్నారులు ఉండటం విశేషం. అదే రోజు ఊట్లపల్లికి చెందిన.. మడకం కుమారి అశ్వారావుపేటలోని ఒక వడ్డీ వ్యాపారి వద్ద.. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు వెళ్లారు. ఇదే సమయంలో ముగ్గురు మహిళలు ఆమె వద్దకు వచ్చి.. మాటలు కలిపి 50 వేలు చోరీ చేశారు. అంతేకాదు పక్కనే ఉన్న మరో మహిళ వద్ద కూడా... 10 వేలు కాజేశారు. ఈ మూడు ఘటనలూ పట్టపగలే జరగటం శోచనీయం. అంతేకాదు మూడు చోరీలు చేసింది మహిళలే కావడం విశేషం. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ... కిలాడీ లేడీలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suicide Attempt: డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు