robbers at toofran: మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద 44వ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. రహదారి మార్గంలో వచ్చే లారీలను లక్ష్యంగా చేసుకొని వీరు దోపిడీలకు పాల్పడ్డారు. అడ్డువచ్చిన నలుగురు డ్రైవర్లపై కత్తులతో దాడి చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రాళ్లతో కొట్టారు. లారీల నుంచి బ్యాటరీలు, సెల్ ఫోన్లు చోరీకి పూనుకున్నారు.
robbers at toofran జాతీయ రహదారిపై దోపిడీ దొంగల హల్‌చల్ - తూప్రాన్ జాతీయ రహదారిపై దొంగలు
robbers at toofran తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. దొంగలు నలుగురు డ్రైవర్లను కత్తులతో పొడిచారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లను విసిరారు.
చోరీకి పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు స్థానిక డ్రైవర్లు యత్నించారు. ఈ క్రమంలో వారిపై కత్తులతో దాడి చేసి దుండగులు పరారయ్యారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన హైమద్ ఖాన్, అజారుద్దీన్, నోమల్ ఖాన్ అనే డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు యత్నించగా... వారిపైనా రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల్లో అర్జున్ రెడ్డి, శ్రీహరి అనే ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి ఇరువురిని విచారిస్తున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: