భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఆలయాల్లో చోరీ చేయడమే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని రాందేవ్ బాబా మందిరం, కాళీ మాత ఆలయంలో దొంగతనం ఘటన మరువకముందే మరొక ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. స్థానిక సువర్చలా సహిత హనుమాన్ గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే హనుమంతుడు.. సతీమణితో ఉన్న ఏకైక గుడి. ఈ ఆలయానికి సింగరేణి సంస్థ నుంచి అధికారుల సహకారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
దేవాలయాలే లక్ష్యంగా వరుస దొంగతనాలు - robberies in yellandu temples
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కేంద్రంగా దొంగలు రెచ్చిపోతున్నారు. పలు ఆలయాల్లో చోరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. హుండీలు పగలగొట్టి నగదు దోచుకెళ్లారు.
ఇల్లందు ఆలయాల్లో చోరీ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు, పోలీసులు పట్టణంలో జరుగుతున్న దేవాలయాల దొంగతనాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ గుడిని పరిశీలించారు.
ఇదీ చదవండి:దారుణం: పాతకక్షలకు ఆరుగురి బలి