వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామంలోని శనేశ్వరాలయంలో ఈనెల 16వ తేదీ అర్థరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.
ROBBERY: గుడిలో చోరీ... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు - chori in temple
గుడిలో చోరి జరిగిన 48 గంటల్లో దొంగలను పట్టుకోని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు వికారాబాద్ పోలీసులు. దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
పాత నేరస్థుడైన మహ్మద్ మారూఫ్‌పై గతంలో దొంగతనం ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారు. మహ్మద్ మారూఫ్‌ను అదుపులోకి తీసుకోని తమదైన రీతిలో విచారించగా... మహ్మద్ ఖుద్దుస్, మహ్మద్ ఖలీల్‌లతో కలిసి దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. మొత్తం 6 కిలోల వెండి ఆభరణాలను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు.
ఇదీ చూడండి:Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!