తెలంగాణ

telangana

ETV Bharat / crime

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - పెళ్లకూరు లో రోడ్డు ప్రమాదం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెళ్లకూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

road-accindent-in-nellore-district
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Mar 16, 2021, 8:33 AM IST

Updated : Mar 16, 2021, 8:41 AM IST

ఏపీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్వాయిపాడు జాతీయ రహదారిపై ఆటోను... టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఆటో.. ముందు ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ఉన్నారు. అందులో.. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
Last Updated : Mar 16, 2021, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details