తెలంగాణ

telangana

ETV Bharat / crime

పుట్టినరోజే.. ఆ యవకుడికి ఆఖరి రోజైంది ! - రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పుట్టినరోజు వేడుకను ఆ యువకులు ఘనంగా జరుపుకొన్నారు. ఆనందంగా ఆడి, పాడి సాయంత్రం వరకు సరదగా గడిపారు. కానీ పుట్టిన రోజే ఆ యువకులకు చివరి రోజు అవుతుందని ఉహించలేకపోయారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. ఆనంద క్షణాలు కాస్తా.. విషాదంతో నిండిపోయాయి. విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డుప్రమాదం
రోడ్డుప్రమాదం

By

Published : Apr 22, 2021, 11:16 PM IST

విశాఖ జిల్లా కొత్తపాలెం వంతెన వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు యలమంచలికి చెందిన కొటారు రవితేజ, నడింపల్లి రాజుగా గుర్తించారు. గాయపడిన వంశీ, ప్రదీప్​లను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

పుట్టిన రోజు వేడుకలకు వచ్చి..

కారులో ప్రయాణిస్తున్న యువకులంతా రాంబల్లి మండలంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇవాళ రవితేజ పుట్టినరోజు కావటంతో మిత్రులను పిలిచి వారికి పార్టీ ఇచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో ఎదురుగా లారీ రావటంతో కారును తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొడుతూ.. పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:పురానాపూల్​ డంపింగ్​ యార్డులో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details