మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించారు. మందమర్రి మండలం గద్దెరేగడికి చెందిన స్వరాజ్, కృష్ణవేణి ద్విచక్రవాహనంపై మంచిర్యాలకు వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ... ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... దంపతులు మృతి - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ ఫ్యాక్టరీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. దంపతులు ఇద్దరు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.