మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పరిధిలోని.. బీహెచ్ఈఎల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురు మైనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మైనర్లకు తీవ్ర గాయాలు - Minors doing triple riding sustained serious injuries in the incident
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
త్రిపుల్ రైడింగ్‌లో.. మైనర్లకు తీవ్ర గాయాలు
తీవ్ర గాయాల పాలైన బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భర్తపై వేడి నూనె, కారం చల్లి పరారైన భార్య, కూతురు