తెలంగాణ

telangana

ETV Bharat / crime

బైక్​ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు యవకులు మృతి - crime news of telangana

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Mahbubnagar latest news
బైక్​ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

By

Published : Apr 8, 2021, 2:17 AM IST

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ శివారులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగర్​ కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సు... నడింపల్లి నుంచి హజిపూర్​కి వెళ్తున్న ఓ ద్వి చక్రవాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో నడింపల్లి గ్రామానికి చెందిన అరవింద్(15), మల్లేశ్ (21)ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. దీంతో కోపోద్రిక్తులైన మృతుల బంధువులు ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:చిట్టీల పేరుతో మహిళ మోసాలు... అడిగితే బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details