శుభకార్యం కోసం వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామం శివారులో జరిగింది. వధువు ఇంటి నుంచి తిరిగి వస్తుండగా వరుడి బంధువులు ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడగా... మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
గుండాల మండలం కన్నాయిగూడెంకు చెందిన పెళ్లి కొడుకు బంధువులు మామకన్ను సమీపంలోని నరసాపురం వద్ద పెళ్లి కూతురి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది దాకా ట్రాక్టర్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.