ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం రాంనగర్ కు చెందిన నలుగురు కుటుంబసభ్యులు దైవదర్శనం కోసం కారులో ధర్మస్థలం వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా హనిమిరెడ్డిపల్లి వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలేశ్వర్ ఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆయన మనుమరాలు శ్రీవిద్య ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం - తెలంగాణ వార్తలు
దైవదర్శనం కోసం ధర్మస్థలం వెళ్లి వస్తుండగా.. జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. అనంతపురం జిల్లా రాంనగర్‌కు చెందిన నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు బేలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తాతా మనవరాలు మృతి చెందారు. ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
కారులో ఉన్న యోగేశ్వర్, సుప్రియ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థతి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఒకరు బలి