ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టగా... నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటో ఒక్కసారిగా ముళ్లపోదల్లోకి పల్టీ కొట్టింది.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు - warangal rural district latest news
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు
ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్పంగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్రం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీకి లేఖ