ఆంధ్రప్రదేశ్‌లోనిశ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు రమ్య, గోపీనాథ్, వారి పిల్లలు సాహిత్, హాసిని, మరో బంధువుతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
వారి బంధువు తారకేశ్వరి, చిన్నారులు సాహిత్, హాసిని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ తారకేశ్వరి(62) మృతి చెందారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.