తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆటోను ఢీకొన్న వ్యాన్​.. ముగ్గురు దుర్మరణం - siddipet district news

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుపాన్‌ వాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా చాట్లపల్లి వాసులుగా గుర్తించారు.

ఆటో ఢీకొన్న తుపాన్ వ్యాన్.. నలుగురు దుర్మరణం
ఆటో ఢీకొన్న తుపాన్ వ్యాన్.. నలుగురు దుర్మరణం

By

Published : Feb 4, 2021, 4:50 PM IST

Updated : Feb 4, 2021, 5:38 PM IST

సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి సమీపంలో ఆటోను... ఎదురుగా వచ్చిన వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చాట్లపల్లికి చెందిన రైతులు శ్రీశైలం, కనకయ్య, రమేశ్‌ వ్యవసాయ పొలానికి డ్రిప్‌ కొనుగోలు చేసేందుకు ఆటోలో బయలుదేరారు. గొల్లపల్లి గ్రామంలో సుజాతతో పాటు మరో మహిళ ఆటో ఎక్కారు.

ఆటోను ఢీకొన్న వ్యాన్​.. నలుగురు దుర్మరణం

జగదేవ్‌పూర్‌ వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్‌, శ్రీశైలం, కనకయ్యలు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మరొకరు ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మృతదేహాలతో రహదారిపై బైఠాయించారు.

ఇవీ చూడండి:విషాదం: కుంటలో పడి నలుగురు మృతి

Last Updated : Feb 4, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details