తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆటోను ఢీకొన్న కారు.. తొమ్మది మందికి గాయాలు - తెలంగాణ వార్తలు

మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను వెనకనుంచి కారు ఢీకొనడంతో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

road accident in narsapur urban park at medak district
ఆటోను ఢీ కొట్టిన కారు.. తొమ్మది మందికి గాయాలు

By

Published : Mar 6, 2021, 7:42 AM IST

ఆటోను కారు ఢీకొన్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ సమీపంలో జరిగింది. ఆటోలో ఉన్న తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నర్సాపూర్ కూరగాయల సంతకు వచ్చి... తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న 4నెలల బాబు నిహల్, తల్లి నవనీత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో మహిళకు రెండు కాళ్లు విరగడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

ఇదీ చదవండి:19వ అంతస్తు నుంచి పోలీసులకు మహిళ ఫోన్​

ABOUT THE AUTHOR

...view details