ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద హైవేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం.. అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు.. తన కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని మద్దిలేటి అయ్యా స్వామి క్షేత్రానికి వెళ్లి.. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురి దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్రగాయాలు - నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి
02:16 April 18
ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురి దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
ఈ ఘటనలో వెంకటేశ్వర్లు, అతడి భార్య లక్ష్మీదేవి, అక్క సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు, నాగమణి, మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
హనుమాన్ జయంతి వేడుకల్లో ఘర్షణ.. ఎస్పీ ముందే రాళ్ల దాడి
భార్య, కుమారుడి హత్య.. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసి మరీ..