Bus accident in Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జాతీయ రహదారి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న AR 02-3641 నెంబర్ గల బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. ఈ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వలన వట్టమర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నకిరెకల్ కామినేని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
డ్రైవర్ పడుకున్నాడు... బస్సు పల్టీలు వేసింది..! - వట్టిమర్తి జాతీయ రహదారి పై ప్రమాదం
Road accident: కుటుంబంలో పెద్ద వ్యక్తి సరిగ్గా లేనప్పుడు ఆ కుటుంబం అంత కష్టాలు అనుభవించవల్సి వస్తుంది. అలానే బస్సు ప్రయాణీకులు డ్రైవర్ పై నమ్మకం ఉంచి ప్రయాణం చేస్తారు. ఆ డ్రైవరే సరిగ్గా తన పని చేయకపోతే ఆ ప్రభావం తోటి ప్రయాణీకులు అందరి మీద పడుతుంది. అలాంటి సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే....
చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం