viral video: మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం అందరిని కలచి వేసింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ప్రియ.. ఈరోజు ఉదయం ఎప్పటిలానే తన ద్విచక్ర వాహనంతో బయలుదేరింది. స్థానిక వివేకనంద విగ్రహం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. లారీ చక్రాల కింద పడిపోయిన ప్రియ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
viral video: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. కలచి వేస్తోన్న సీసీ కెమెరా దృశ్యాలు - Road accidents in Telangana
viral video: మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వివేకనంద విగ్రహం వద్ద ప్రైవేట్ ఉద్యోగి ప్రియా తన ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రియ తీవ్ర గాయలతో అక్కడిక్కడే మృతి చెందింది.
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం