తెలంగాణ

telangana

ETV Bharat / crime

విధులకు వెళ్తున్న కార్మికులను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి

Road accident in Medak: మెదక్​ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

Road accident in Medak district
Road accident in Medak district

By

Published : Dec 24, 2022, 9:46 AM IST

Updated : Dec 24, 2022, 12:38 PM IST

Road accident in Medak: మెదక్​ జిల్లాలో ఈరోజు ఉదయం కారు ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మెదక్​ పట్టణంలో పారిశుద్ధ్య విధులు నిర్వహించేందుకు కార్మికులు ఉదయం కార్యాలయానికి వెళ్తున్నారు. ఇంతలో ముందు నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న ఓ కారు వారిపై దూసుకెళ్లింది. దీంతో దాయర వీధికి చెందిన నరసమ్మ అక్కడికక్కకడే మృతి చెందగా యాదమ్మ అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

ప్రమాదంలో మరో ముగ్గరికి తీవ్ర గాయలుకావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మెదక్​ డీఎస్పీ సైదులు. సీఐ మధు, రూరల్​ సీఐ విజయ్​ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. మృతి చెందిన ఇద్దరు మహిళను శవపంచనామ నిమిత్తం మెదక్​ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. కారును స్టేషన్​కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమమ్యాయి.

విధులకు వెళ్తున్న కార్మికులను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2022, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details