ఆటోను ఢీకొన్న లారీ.. ఆరుగురు దుర్మరణం - krishna district accident
06:30 March 14
ఆటోను ఢీకొన్న లారీ.. ఆరుగురు దుర్మరణం
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో-లారీ ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒడిశా రమేష్, భూక్య నాగరాజు, బాణావతు స్వనా, భూక్య సోమ్లా, బర్మావత్ బేబీ, బాణావతు నాగు ఉన్నారు.
మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు విజయవాడ, నూజివీడు ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితులంతా నూజివీడు లయన్ తండా కూలీలుగా గుర్తించారు.