ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో... రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా... 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - road accident in krishna district.. 3 died
ఏపీలో వేకువ జామునే ఓ భయంకర రోడ్డు ప్రమాదం జరగ్గా... కాస్తా తెల్లారాక మరో ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా... 9 మంది గాయపడ్డారు.
3 died in krishna district accident
పెడన మండలం జింజేరు నుంచి గుడ్లవల్లేరు మండలానికి కూలి పనులకు వస్తుండగా... ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో మృతులు, గాయపడిన వారంత ఒకే గ్రామానికి చెందిన వారు అయిన కారణంగా.. జింజెరు గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.