ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు కింద పడిపోగా.. వారిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన ఘటన హైదరాబాద్లోని హిమాయత్ నగర్ కూడలి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో భర్తకు స్వల్పగాయాలవ్వగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.
దంపతుల పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. భార్య పరిస్థితి విషమం - హైదరాబాద్ రోడ్డు ప్రమాద వార్తలు
హైదరాబాద్లోని హిమయత్ నగర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతోన్న దంపతులు అదుపుతప్పి కింద పడిపోగా.. ఆర్టీసీ బస్సు వారి పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రగాయలయ్యాయి. గమనించిన ట్రాఫిక్ పోలీసులు బాధితురాలిని హైదర్గూడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

దంపతుల పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. భార్య పరిస్థితి విషమం
ద్విచక్రవాహనంపై దంపతులిద్దరు ప్రయాణిస్తుండగా హిమాయత్ నగర్ కూడలి వద్ద రోడ్డుపై గుంతలు ఉండడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. వారి వెనుకే వస్తున్న ఉప్పల్ డిపోకు చెందిన బస్సు మహిళ కాళ్ల పైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన ట్రాఫిక్ పోలీసులు వారిని హైదర్గూడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ