హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ నుంచి వస్తున్న ఆటోను.. కారు ఢీ కొట్టడంతో రాజేందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. కమలాపూర్ మండలం దేశ్‌రాజ్‌పల్లికి చెందిన రాజేందర్ అనే ఆటో డ్రైవర్.. భాజపాలో చురుకైన కార్యకర్త (bjp activist killed in road accident). తెరాస పార్టీకి చెందిన నాయకుడి అనుచరులే.. కారుతో ఢీ కొట్టి చంపినట్లు మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో భాజపా కార్యకర్త మృతి... అది వారిపనే అంటున్న కుటుంబ సభ్యులు - హనుమకొండ నేర వార్తలు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద... రహదారి ప్రమాదంలో మృత్యువాత పడ్డ.. భాజపా కార్యకర్త కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, గడ్డం వివేక్... ఏనుగు రవీందర్‌రెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుని కుటుంబాన్ని న్యాయం చేయాలంటూ.. మృత దేహంతో హుజూరాబాద్-పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, గడ్డం వివేక్... ఏనుగు రవీందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్.. ధర్నా వద్దకు చేరుకొని వారితో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి స్పందించారు. ఈ ప్రమాదం కేవలం నిర్లక్ష్యంతోనే జరిగిందన్నారు. రాజకీయపరంగా జరిగింది కాదని సీపీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:huzurabad by election: 19 మంది అభ్యర్థుల నామినిషన్లు తిరష్కరణ