బస్సును ఓవర్టేక్ చేయబోయి ముగ్గురిని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి - రోడ్డుపై ఉన్న వారిని ఢీకొన్న కంటెయినర్
07:42 July 06
కంటైనర్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనానికి మరమ్మతు చేస్తుండగా అటుగా వస్తున్న కంటైనర్ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘనటలో డీసీఎం వాహనాన్ని మరమ్మతు చేస్తున్న ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సును ఓవర్ టేక్ చేయబోయి రోడ్డుపై ఉన్న ముగ్గురిని కంటైనర్ ఢీ కొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.