75 ఏళ్ల వయసులోనూ ఓ వృద్ధుడు మనోధైర్యంతో... కరోనాను జయించాడు. కానీ ఇంతలోనే రోడ్డు ప్రమాదం అతణ్ని మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ మండలంలో జరిగింది.
కరోనాను జయించి.. రోడ్డు ప్రమాదంలో ఓడిపోయిన వృద్ధుడు - తుప్రాన్ మండలంలో ప్రమాదం
కరోనా నుంచి కోలుకున్నఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ మండలంలో జరిగింది. కూరగాయల కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
road accident, toopran mandal, Medak district
తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెలికి చెందిన నన్నేమియా, ఆయన భార్య.. ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ధైర్యంగా ఉంటూ.. వారు కరోనా నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై కూరగాయలు తెచ్చుకునేందుకు నన్నేమియా తుప్రాన్ వైపు వెళ్తుండగా డీసీఎం ఢీ కొట్టగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. కరోనాను జయించినప్పటికీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో... భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ఇదీ చూడండి: అర్ధరాత్రి ఇంట్లోకి ఎంటరై.. ఇటుకతో చంపిన దుండగుడు