హైదరాబాద్‌లోని తెలుగుతల్లి పైవంతెన కింద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను... ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఆదర్శనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
రోగులు లేకున్నా వేగంగా వచ్చిన అంబులెన్స్... ఢీకొట్టిన కారు - రోడ్డు ప్రమాదం వార్తలు
రోగులు లేకున్నా, రెడ్ సిగ్నల్ పడినా లెక్కచేయకుండా ఓ అంబులెన్స్ అడ్డుగా రావడంతో ఓ కారు దానిని ఢీకొట్టింది. ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలుగుతల్లి పైవంతెన కింద చోటు చేసుకుంది.
రోగులు లేకున్న వేగంగా వచ్చిన అంబులెన్స్... ఢీకొట్టిన కారు
ఈ ఘటనలో అంబులెన్స్ బోల్తా పడగా.. కారు ముందు భాగం ధ్వంసమైంది. వాహనంలో రోగులు లేకపోయినా... అంబులెన్స్ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చూడండి:కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!