తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ... నలుగురు మృతి - news updates ap

ROAD ACCIDENT IN Tamil Nadu: తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి చెన్నై వెళ్తుండగా ఆంధ్రా ట్రావెల్స్​ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్​, క్లీనర్​ సహా మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

tamilnadu accident
tamilnadu accident

By

Published : Dec 5, 2022, 3:48 PM IST

ROAD ACCIDENT AT TAMILNANDU : తమిళనాడు పరిధిలోని పొన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొన్నేరి వద్ద ఆంధ్రా ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్లీనర్‌, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

tamilnadu accident

ప్రమాదంలో బస్సు క్లీనర్ శ్రీధర్‌, నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన తోకల సతీష్ కుమార్, బెంగళూరుకు చెందిన తుమ్మల రోహిత్ ప్రభాత్ అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ జానకిరామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details